పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కలెక్టర్
PPM: అమ్మ బాగున్నారా, అయ్యా బాగున్నారా ఇదిగో మీ పించాన్ అంటూ ఇంటింటికీ వెళ్ళి పింఛన్లు పంపిణీ చేసి అవ్వా తాత బాగోగులను కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి అడిగి తెలుసుకున్నారు.పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే ప్రతి నెల ఇంటింటికీ వెళ్ళి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. సామాజిక పింఛన్లు కార్యక్రమం సీతానగరం మండలం సూరంపేటలో నిర్వహించారు.