అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

NRPT: ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. గోటూరు గ్రామంలోని వాగు నుండి ఇసుకను రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న వెంకటయ్య, రాఘవేందర్, బాలరాజు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.