ప్రమాదకరంగా మారిన ఆర్కే వన్ అండర్ బ్రిడ్జి

ప్రమాదకరంగా మారిన ఆర్కే వన్ అండర్ బ్రిడ్జి

MNCL: రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే వన్ అండర్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జి పైభాగంలో పెచ్చులూడి పడుతున్నాయి. నిత్యం వందలాది మంది ఈ బ్రిడ్జి కింద నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఏ సమయంలో బ్రిడ్జి కూలుతుందోననే భయం మధ్య ప్రయాణం సాగిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.