అనాజిపురంలో వాహనదారులకు హెల్మెట్ల పంపిణి

అనాజిపురంలో వాహనదారులకు హెల్మెట్ల పంపిణి

NLG: రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతని చింతపల్లి SI ముత్యాల రామ్మూర్తి అన్నారు. అనాజిపురం గ్రామంలో సర్పంచ్ బుషిపాక అనిత మొగులయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన 'అరైవ్ అలైవ్' కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం సర్పంచ్ తన సొంత నిధులతో వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. గ్రామంలోకి వచ్చే వాహనాలకు హెల్మెట్ ధరిస్తేనే అనుమతించాలన్నారు.