ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: MLA KR

WGL: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు దక్కుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. శుక్రవారం హనుమకొండ కాళోజీ క్షేత్రంలో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలను దోచుకోవడానికి రాలేదని, సేవ చేయడానికి వచ్చామన్నారు. త్వరలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని పైడిపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తామన్నారు.