రికార్డుల్లో పేర్లను మార్చిన కార్పొరేటర్..

NLR: 17వ డివిజన్ గుండ్లపాలెం షిర్డీ సాయి లేఔట్‌లో కార్పొరేటర్ పేనేటి సుధాకర్, తన రెండు ఫ్లాట్లతో పాటు మరికొందరి ఫ్లాట్లను ఆక్రమించారని బాధితుడు మద్దెల సుధాకర్ సోమవారం ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఫ్లాట్లను ఆక్రమించి పొలంగా మార్చి, రికార్డుల్లో నుంచి తమ పేర్లను తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.