మధిరలో తప్పిన పెను ప్రమాదం..!

మధిరలో తప్పిన పెను ప్రమాదం..!

KMM: మధిర పట్టణంలో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు టైర్లకు ఉన్న ఐరన్ బోల్టులు ఊడిపోయాయి. దీన్ని గమనించిన స్థానికులు డ్రైవర్‌కు సమాచారం ఇవ్వడంతో చాకచాక్యంగా వ్యవహరించి రోడ్డు పక్కకు నిలిపివేశారు. కాగా బస్సు టైర్ ఊడి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.