ఢిల్లీ జట్టులోకి సంజూ శాంసన్?
IPL మినీ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ప్లేయర్ల స్వాప్ డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు RR నుంచి సంజూ శాంసన్, DC నుంచి ట్రిస్టన్ స్టబ్స్ జట్లు మారనున్నట్లు సమాచారం. అంతకుముందు KL రాహుల్ పేరు వినిపించినా అతణ్ని వదులుకునేందుకు DC సమ్మతించలేదని, రానున్న సీజన్‌లో అతనే ఆ జట్టును నడిపిస్తాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి.