ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
WGL: వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. సొప్పరి సంధ్యారాణి-అశోక్ దంపతులకు రూ. 5 లక్షల సహాయంతో నిర్మించిన ఇంటిని శుక్రవారం ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.