‘ఢిల్లీలో ఒక మాట.. రాష్ట్రంలో ఒక మాట’

‘ఢిల్లీలో ఒక మాట.. రాష్ట్రంలో ఒక మాట’

TG: రాష్ట్రంలో యూరియా కొరతపై కాంగ్రెస్ ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రంలో మరో మాట మాట్లాడుతోందని BRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు యూరియా కొరతపై ధర్నాలు చేశారని, అందులో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారని.. కానీ రాష్ట్రంలో మంత్రులు కొరత లేదని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం ఆడుతోందని దాసోజు శ్రవణ్ విమర్శించారు.