ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

సిద్దిపేట జిల్లాలోని పొన్నాల చౌరస్తాలో భారత రత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ హరికృష్ణ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ భారతదేశానికి ఆధునికతను నాంది పలికిన నాయకుడన్నారు.