వరి కోత యంత్రాన్ని నడిపిన రాయదుర్గం ఎమ్మెల్యే

వరి కోత యంత్రాన్ని నడిపిన రాయదుర్గం ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం నియోజకవర్గంలో రైతులు కనీస మద్దతు ధరకు ధాన్యం అమ్ముకునేలా మొత్తం 23 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. గతంలో 5,000 మెట్రిక్ టన్నుల కంటే తక్కువ సేకరణ జరగగా, ఈ ఏడాది 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతులు పొందామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరి కోత యంత్రాన్ని నడిపారు.