సీఎం అధ్యక్షతన సమావేశంలో పాల్గొన్న ఎంపీ

బాపట్ల: సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలో శనివారం జరిగిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సహచర ఎంపీలతో కలిసి, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురుంచి పార్లమెంట్‌లో గట్టిగా గళం వినిపించాలని అన్నారు.