ALERT: పరీక్షలు వాయిదా
ఈ నెలలో జరగాల్సిన నీట్-సూపర్ స్పెషాలిటీ పరీక్షలను కేంద్రం డిసెంబరు 26, 27 తేదీలకు వాయిదా వేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో వైద్య విద్య పీజీ కోర్సు పరీక్షలు, నీట్-సూపర్ స్పెషాలిటీ పరీక్షలు ఒకేసారి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రమంత్రి నడ్డాకు లేఖ రాశారు. దీంతో పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించారు.