చాకలి ఐలమ్మ పోరాటాన్ని కొనియాడిన.. రజక సంఘం నేతలు

చాకలి ఐలమ్మ పోరాటాన్ని కొనియాడిన.. రజక సంఘం నేతలు

BHPL: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గొర్లవీడు గ్రామంలో బుధవారం గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం ఐలమ్మ జరిపిన పోరాటాన్ని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె త్యాగనిరతిని స్మరించారు.