VIDEO: గెలుపుపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధీమా
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధీమా వ్యక్తం చేశారు. యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద ఆమె మాట్లాడారు. ఓట్ల సరళి చూస్తే.. తన గెలుపు ఖాయమైనట్లేనని అనిపిస్తోందని పేర్కొన్నారు. అంతకుముందు ఆమె మాదాపూర్‌లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.