VIDEO: దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: గుడ్లవల్లేరు బస్టాండ్‌లో దివ్యాంగుల కోసం ప్రవేశపెట్టిన “దివ్యాంగ శక్తి” పథకాన్ని ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా దివ్యాంగులతో కలిసి గుడ్లవల్లేరు నుంచి గుడివాడ డిపో వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణ సమయంలో స్వయంగా దివ్యాంగ శక్తి టికెట్లు జారీ చేసి, వారితో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.