చమురు సంక్షోభం.. అమెరికా సంచలన నిర్ణయం

చమురు సంక్షోభం.. అమెరికా సంచలన నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న వేళ ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చమురు విక్రయాలపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా సడలిస్తున్నట్లు ప్రకటించింది. సముద్రంలో నౌకల్లో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల విక్రయానికి ఏప్రిల్ 19 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో సుమారు 140 మిలియన్ బారెల్స్ చమురు ప్రపంచ మార్కెట్‌లోకి రానుంది.