ప్రజల సహకారంతో చెత్త నిర్వహణకు సమగ్ర కార్యాచరణ
నంద్యాల ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శనివారం స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ఎంపీడీవో సుగుణశ్రీ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థల్లో చెత్త నిర్వహణను శాస్త్రీయంగా, క్రమబద్ధంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. నంద్యాల మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు.