అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు
VZM: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్‌కోట సీఐ నారాయణమూర్తి అన్నారు. ఎస్‌కోటలో రైల్వే స్టేషన్, పుణ్యగిరి రోడ్డు, శివరామరాజుపేట, ధర్మవరం గ్రామ శివార్లలో మంగళవారం ఆయన తన సిబ్బందితో కలిసి డ్రోన్ సహాయంతో నిఘా నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గంజాయి కాల్చడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు.