'ఇండిగో సంక్షోభాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు'
ఇండిగో సంక్షోభంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభ వేదికగా స్పందించారు. ఈ సమస్యను తేలిగ్గా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. దీనిపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించినట్లు తెలిపారు. 'పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాం. సిబ్బంది కొరత, ప్రణాళిక లోపం వల్లే ఇండిగోలో సమస్య వచ్చింది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయడమే మా తొలి ప్రాధాన్యత' అని రామ్మోహన్ వెల్లడించారు.