'అఖండ 2' టీమ్ శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

'అఖండ 2' టీమ్ శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

బాలకృష్ణ నటించిన 'అఖండ 2' చిత్రం మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ SMలో పోస్ట్ చేసింది. కాగా, ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.