గిద్దలూరు: ధ్వజస్తంభ కార్యక్రమంలో పాల్గొన్న MLA

మండలంలోని గుమ్మలపల్లెలో శుక్రవారం MLA ముత్తుముల అశోక్‌రెడ్డి పర్యటించారు. గ్రామంలోని సీతారాముల వారి దేవస్థానంలో ధ్వజస్తంభ కార్యక్రమంలో ముఖ్య అతిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.