ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ

NLR: పొదలకూరు మండలం మొగళ్లూరు పంచాయతీకి చెందిన మాజర గురవాయపాలెం గ్రామంలో నూతనంగా సీతా సమేత శ్రీకోదండరామస్వామి ఆలయం నిర్మించారు. ఇందులో భాగంగా శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీరాముడిని దర్శించుకున్నారు.