రెవెన్యూ సేవల వేగవంతంపై కలెక్టర్ రివ్యూ

GNTR: గురువారం జరిగిన రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ (ఐ.ఏ.ఎస్.)పాల్గొన్నారు. గుంటూరులోని కలక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా రెవెన్యూ శాఖ సేవలు, ఫిర్యాదుల పరిష్కారం త్వరితగతిన జరగాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులను సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.