భార్యను బండరాయితో కొట్టి చంపాడు
AP: కాకినాడ జిల్లా ఇంద్రపాలెం గొల్లపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపాడు. గంగరాజు అనే వ్యక్తి కుటుంబ కలహాలతోనే తన భార్యను బండరాయితో కొట్టాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య మల్లీశ్వరి(47) మృతి చెందింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.