'క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాడుదాం'

SRPT: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బహుళ జాతి కంపెనీలు దేశాన్ని విడిచి వెళ్లేంతవరకు పోరాడుదామని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్ అన్నారు. మంగళవారం తిరుమలగిరిలో ఆ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మోదీ బడా కంపెనీలకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని చేస్తున్నాడని విమర్శించారు.