'కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బంది లేకుండా చూడాలి'
GDL: పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. సీఎస్ రామకృష్ణారావుతో కలిసి సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.