సోఫీ నగర్ కాలనీలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్
నిర్మల్ పట్టణంలోని సోపి నగర్ కాలనీలో బుధవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో పేరుకుపోయిన చెత్తను కార్మికుల చేత తొలగింపజేశారు. కాలనీవాసులు తమ కాలనీలో డ్రైనేజీలను, రోడ్లను శుభ్రపరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతిరోజు కాలనీలో పరిశుభ్రత చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ హామీ ఇచ్చారు.