నేడు 17 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు

W.G: మొగల్తూరు మండలంలో 17 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించిందని మొగల్తూరు మండల డిప్యూటీ ఎంపీడీవో మేడిది నవీన్ కిరణ్ అన్నారు. గురువారం మొగల్తూరులో ఆయన మాట్లాడుతూ.. గ్రామ సభల్లో సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు చర్చించి తీర్మానాలు చేయాలని కేంద్రం సూచించిందని ఆయన అన్నారు.