ప్రతి జిల్లాలోనూ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాం: మంత్రి
ప్రభుత్వంతో చర్చించి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక మాక్ అసెంబ్లీ జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా, విలువలతో కూడిన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అందుకోసం విద్యాశాఖ వినూత్న ఆలోచనలతో, విప్లవాత్మక మార్పులతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.