తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

CTR: జిల్లాలో రానున్న వేసవి దృష్ట్యా ఎంపీడీఓలు త్రాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా నిధులను సద్వినియోగం చేయాలని, తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.