నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BDK: దమ్మపేట 33కేవీ మందలపల్లి లైన్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా నేడు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మందలపల్లి, అచ్చుతాపురం, గాంధీనగరం, రంగువారిగూడెం, ముష్టిబండ, వడ్లగూడెం గ్రామాల్లో మూడు ఫేజ్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.