రూ.3.20 లక్షలు పట్టివేత
SDPT: ములుగు మండలం వంటిమామిడి చెక్‌పోస్ట్ వద్ద ఎస్సై రఘుపతి ఆధ్వర్యంలో చేపట్టిన వాహన తనిఖీల్లో రూ. 3.20 లక్షల నగదు పట్టుబడింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో తనిఖీలు చేపట్టగా ఓ ప్రయాణికుడి వద్ద లభించినట్టు తెలిపారు. సరైన ఆధారాలు చూపించకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు