VIDEO: రాజధానిలో పర్యటిస్తున్న ప్రపంచ బ్యాంకు బృందం
GNTR: ప్రపంచ బ్యాంకు బృందం సోమవారం రాజధాని అమరావతిలో పర్యటన ప్రారంభించింది. తొలుత రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో సమావేశమైన బృందం, అనంతరం నేలపాడులోని ఎన్జీవో క్వార్టర్స్‌ను పరిశీలించి, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడింది. రాజధాని ప్రాంతంలోని రోడ్లు, భవనాలను కూడా బృందం పరిశీలించనుంది.