టీటీడీ మరో కీలక నిర్ణయం

టీటీడీ మరో కీలక నిర్ణయం

AP: టీటీడీ పరిధిలోని ఆలయాల్లో తిరుమల తరహాలో భక్తులకు అన్న ప్రసాదాలు అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఈవో అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిధిలోని ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. అన్న ప్రసాదాలు తయారు చేసే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఆలయాల్లో పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలపై రోజు వారీ నివేదికను తయారు చేయాలని తెలిపారు.