ఆలమూరులో గ్యాస్ సిలిండర్ కోసం ఎగబడిన జనం

ఆలమూరులో గ్యాస్ సిలిండర్ కోసం ఎగబడిన జనం

కోనసీమ: యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత ఉండడంతో సిలిండర్ కోసం జనం ఎగబడుతున్నారు. ఆలమూరు మండలం మూలస్తానంలో బుధవారం సాయంత్రం గ్యాస్ వ్యాన్ రాగానే ఒక్కసారిగా జనం సిలిండర్ కోసం ఎగబడడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ సరఫరా చేసే వ్యాన్ డ్రైవర్‌లు తమకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే గ్యాస్ ఇస్తున్నారని జనం ఆరోపించారు.