డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితుడికి వినూత్న శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితుడికి వినూత్న శిక్ష

GDWL: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన అయిజ మండలం మూగోనిపల్లికి చెందిన శ్రీరామ్‌కు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ జడ్జి నేరెళ్ల వెంకట హైమా పూజిత వినూత్న శిక్ష విధించారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిన్న ఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిందుతుడితో మొక్కలు నాటించారు. ఇది సమాజ సేవలో భాగంగా విధించిన శిక్ష అని ఎస్సై తెలిపారు.