పెద్దమ్మ తల్లికి ఘనంగా బోనాలు

ఆదిలాబాద్: భైంసా మండలం దేగాంలో ఆదివారం బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో డప్పు చప్పుళ్లు, కోలాట నృత్యాలు, భక్తి పారవశ్యంతో పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు బాగా కురిసి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నారు.