అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ ఎమ్మెల్యే
SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి శనివారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.