త్వరలో ఆన్‌లైన్‌లో శ్రీవారి డాలర్లు
AP: శ్రీవారి భక్తుల కోసం వారు ఎంతో పవిత్రంగా భావించే బంగారు, వెండి డాలర్లను దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఆన్‌లైన్‌లో అందించేందుకు టీటీడీ సిద్దమవుతోంది. టీటీడీ ఆదాయం పెంపునకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫైనాన్స్ కమిటీ ఇటీవల శ్రీవారి డాలర్ల విక్రయాలు పెంచాలని సిఫార్సు చేసింది. అదేవిధంగా డాలర్ల డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మలచాలని నిర్ణయించారు.