జిల్లాలో ధాన్యం కొనుగోలు వివరాలు ఇలా..!
MLG: జిల్లాలో ఏర్పాటు చేసిన 185 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 4983.920 మెట్రిక్ టన్నుల ధాన్యం చేరిందని ఇవాళ కలెక్టర్ దివాకర్ తెలిపారు. ఇందులో 17 శాతం తేమతో కూడిన 2263.840 మెట్రిక్ టన్నులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 2151.480 మెట్రిక్ టన్నులను మిల్లులకు రవాణా చేయగా, కేంద్రాల్లో 112.360 మెట్రిక్ టన్నులు నిల్వలుగా ఉన్నాయి.