కొలనుభారతి క్షేత్రంలో ప్రత్యేక పూజలు
NDL: కొత్తపల్లి మండలం కొలనుభారతి క్షేత్రంలో ప్రత్యేక పూజలు ఆదివారం నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతి అమ్మవారి నిజరూప దర్శనం ఈ ఆలయ ప్రత్యేకతగా భక్తులను ఆకర్షిస్తోంది. పుస్తకపాణిగా దర్శనమిచ్చే అమ్మవారు నాలుగు చేతులతో ఉత్తరాభిముఖంగా కనిపిస్తారు. అంకుశం, అభయహస్తం, పుస్తకం, యమపాశంతో భక్తులకు కరుణాకటాక్షం ప్రసాదిస్తున్నారు.