15వ ఆర్థిక సంఘాలతో రహదారుల నిర్మాణాలు

15వ ఆర్థిక సంఘాలతో రహదారుల నిర్మాణాలు

SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని సర్పంచ్ బూరెల్లి శంకర్రావు, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణ బాబు తెలిపారు. ఆదివారం పంచాయతీలోని మారుతి నగర్ ఒకటవ వీధిలో నాలుగు లక్షల రూపాయలతో రహదారి నిర్మాణ పనులను శంకుస్థాపన చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. పంచాయతీలో పలు రహదారులు పూర్తి చేశామన్నారు.