రివా క్లినిక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రివా క్లినిక్‌ను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గురువారం ప్రారంభించారు. ఇక్కడ స్కిన్, హెయిర్, ఆర్ధోపెడిక్ విభాగాల్లో వైద్య సేవలు అందించనున్నారు. దీన్ని ఏర్పాటు చేసిన మైలవరం వాస్తవ్యులు డాక్టర్ చాట్ల రత్నకాంత్‌ని ఎమ్మెల్యే అభినందించారు.