లిఫ్ట్ తెగిపడి ముగ్గురి మృతి

HYD: సికింద్రాబాద్‌లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డులో ప్రమాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డు నిర్మాణ పనుల్లో లిఫ్ట్ తెగిపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పవర్ ప్లాంట్‌లో చిమ్నీ అమర్చుతుండగా లిఫ్ట్ కూలిపోయింది. మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేశ్ సర్కార్ (21), ప్రకాశ్ మండల్ (24), అమిత్రాయ్ (20)గా గుర్తించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.