పేకాట శిబిరాలపై దాడి..ఒకే సారి 74 మంది అరెస్టు
KKD: జగ్గంపేట సర్కిల్‌లో పేకాట శిబిరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. SP బిందుమాధవ్ ఆదేశాలతో శనివారం సాయంత్రం నిర్వహించిన మెరుపు దాడుల్లో 74 మంది జూదరులు చిక్కారు. కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట మండలాల్లో సాగిన ఈ తనిఖీల్లో రూ.1,39,840 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ YRK శ్రీనివాస్ శనివారం రాత్రి తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచినట్లు పేర్కొన్నారు.