గంగమ్మ ఆలయంలో హుండీ దోపిడీ

గంగమ్మ ఆలయంలో హుండీ దోపిడీ

సత్యసాయి: లేపాక్షి మండలం కొండూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న గంగమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు హుండీని పగలగొట్టి సుమారు 50 వేల రూపాయల నగదును దొంగిలించినట్లు సమాచారం. ఇవాళ ఉదయం ఆలయ కమిటీ సభ్యులు హుండీ పగిలి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.