VIDEO: కల్తీ ఆహారం.. ఓయూ విద్యార్థుల నిరసన
HYD: ఓయూలోని గోదావరి హాస్టల్ వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. కల్తీ ఆహారాన్ని పెడుతున్నారంటూ ఓయూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కల్తీ ఆహారంపై అడగడంతో ఫుడ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారంటూ ఆరోపించారు. నాణ్యతలేని కల్తీ ఆహారాన్ని పెడుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొని నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు.