లక్ష్మీ నరసింహ స్వామికి ముత్తంగి కవచాలు వితరణ
BDK: రామాలయ అనుబంధ ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారి అలంకరణ కోసం ధర్మవరం వేణుమాధవ్, శిరీష దంపతులు సుమారు రూ. 80 వేలు విలువైన ముత్తంగి కవచాలను విరాళంగా అందజేశారు. స్వామివారిపై భక్తితో ఈ వితరణ చేసిన దంపతులను ఆలయ అధికారులు అభినందించారు. గురువారం ఆలయ ఈఓ దామోదర్ రావును కలిసి ఈ కవచాలను సమర్పించారు.